Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ ఆట‌తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు

ktr praises dhoni
  • చెన్నై జ‌ట్టుని గెలిపించిన ధోనీ
  • వ‌య‌సు అనేది ఒక అంకె మాత్ర‌మేన‌న్న కేటీఆర్
  • ధోనీ ఓ ఛాంపియ‌న్.. అసాధార‌ణ ఫినిష‌ర్ అని ప్ర‌శంస‌లు
గ‌త రాత్రి ముంబై జ‌ట్టుపై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట్స్‌మ‌న్ ధోనీ చివ‌రి ఓవ‌ర్లో ఆడిన తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ధోనీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. 

'వాస్త‌వానికి వ‌య‌సు అనేది ఒక అంకె మాత్ర‌మే. ధోనీ ఓ ఛాంపియ‌న్.. అసాధార‌ణ ఫినిష‌ర్.. ఓ లెజెండ్' అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, చెన్నై జ‌ట్టు విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో ముంబైతో జ‌రిగిన మ్యాచ్ లో చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ ధ‌నా ధ‌న్ షాట్లు కొట్టి జ‌ట్టును గెలిపించాడు.
KTR
MS Dhoni
Cricket

More Telugu News